![]() |
![]() |

తెలుగువారికి తొలుత దర్శకుడిగా, ఆపై నటుడిగా చేరువయ్యాడు శాండిల్ వుడ్ సెన్సేషన్ ఉపేంద్ర. `కన్యాదానం`, `ఒకే మాట`, `రా`, `నీతోనే ఉంటాను`, `టాస్`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి తెలుగు చిత్రాల్లో సందడి చేసిన ఉపేంద్ర.. త్వరలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా `గని`తో ఎంటర్టైన్ చేయనున్నాడు. ఏప్రిల్ 8న ఈ మూవీ జనం ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉంటే, తాజాగా ఉపేంద్ర ఓ భారీ బడ్జెట్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ వివరాల్లోకి వెళితే.. `అతడు`, `ఖలేజా` తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ బాట పట్టనున్న ఈ చిత్రంలో మహేశ్ కి బావగా నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ రోల్ లో ఉపేంద్ర నటించే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

కాగా, మహేశ్ - త్రివిక్రమ్ థర్డ్ జాయింట్ వెంచర్ ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. మహేశ్ కి జోడీగా పూజా హెగ్డే నటించనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నాడు.
![]() |
![]() |