![]() |
![]() |

1997లో విడుదలైన `ఎగిరే పావురమా!` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది లైలా. ఇక అదే సంవత్సరం రిలీజైన `అబ్బాయి గారి పెళ్ళి`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్. అలా.. ఒకే క్యాలెండర్ ఇయర్ లో తెలుగువారిని పలకరించి అలరించిన ఈ అందాల తారలు.. అనతికాలంలోనే అగ్ర కథానాయకులతో సందడి చేసి మురిపించారు. తెలుగు, తమిళ భాషల్లో సిమ్రాన్ స్టార్ డమ్ చూడగా.. కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ అనిపించుకుంది లైలా. అంతేకాదు.. ఈ ఇద్దరు కూడా తమిళ చిత్రం `పార్తేన్ రసిత్తేన్` (`నా మనసిస్తా.. రా!` ఒరిజనల్ వెర్షన్)లో కలిసి నటించారు.

ఇదిలా ఉంటే, తాజాగా సిమ్రాన్ వద్దనుకున్న ఓ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట లైలా. ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా `అభిమన్యుడు` ఫేమ్ పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో `సర్దార్` పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కార్తి తండ్రీకొడుకులుగా నటిస్తున్నట్లు సమాచారం. కాగా, కొడుకు పాత్రకి జోడీగా రాశీ ఖన్నా, రాజీషా విజయన్ కనిపించనుండగా.. తండ్రి పాత్రకి జంటగా సిమ్రాన్ నటించాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో ఇప్పుడా వేషంలో లైలా దర్శనమివ్వనుందట. మరి.. సిమ్రాన్ వద్దనుకున్న పాత్రలో లైలా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా, 16 ఏళ్ళ తరువాత ఈ సినిమాతోనే రి-ఎంట్రీ ఇస్తోంది లైలా.
![]() |
![]() |