![]() |
![]() |

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న రెండో మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. శ్రీకర స్టూడియోస్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి, ఛార్మి కౌర్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీ లాంచ్ తాజాగా ముంబైలో జరిగింది.

ఇప్పటికే విజయ్, పూరి కాంబినేషన్ లో 'లైగర్' అనే మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఆగష్టు 25 న రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే విజయ్, పూరి మరో సినిమాకి జత కట్టారు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'జనగణమన'ను విజయ్ తో తీయనున్నాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ అధికారిక ప్రకటన వచ్చింది. నిజానికి ఈ సినిమాని అప్పట్లో మహేష్ బాబుతో చేయాలని పూరి ప్రయత్నించాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అదే సినిమాని విజయ్ తో చేస్తుండగా.. మహేష్ సన్నిహితుడు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి నిర్మిస్తుండటం విశేషం.

'జనగణమన' సినిమాకి పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని 'KGF' తరహాలో 'JGM' అనే టైటిల్ పెట్టారు. ఈ మేరకు టైటిల్ తో కూడిన కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇండియా మ్యాప్, యుద్ధ విమానాలు, సైనికులతో పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. అలాగే విజయ్ లుక్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు. సైనికుడిగా విజయ్ లుక్ ఆకట్టుకుంటోంది. అంతేకాదు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఆగష్టు 3, 2023 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ ఏడాది ఆగష్టులో 'లైగర్'తో, వచ్చే ఏడాది ఆగష్టులో 'JGM'తో విజయ్-పూరి కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
![]() |
![]() |