![]() |
![]() |

పోలీస్ పాత్రలకు వన్నె తెచ్చిన తెలుగు కథానాయకుల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు. `ఇన్ స్పెక్టర్ ప్రతాప్`, `రౌడీ ఇన్ స్పెక్టర్`, `లక్ష్మీ నరసింహా` వంటి విజయవంతమైన సినిమాలతో పాటు పలు చిత్రాల్లో ఖాకీ ధరించి ఆకట్టుకున్నారు బాలయ్య. కట్ చేస్తే.. త్వరలో ఈ నందమూరి హ్యాండ్సమ్ హీరో మరోమారు కాప్ స్టోరీలో ఎంటర్టైన్ చేయనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `సరిలేరు నీకెవ్వరు` చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బాలయ్య ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా దర్శనమివ్వబోతున్నారట. కాగా, ఈ చిత్రం విజయదశమి సందర్భంగా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. అలాగే, 2023 వేసవిలో రిలీజ్ చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే బాలయ్య - అనిల్ కాంబో మూవీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. మరి.. పోలీసాఫీసర్ గా బాలయ్య మరోసారి మెస్మరైజ్ చేస్తారేమో చూడాలి.
ఇదిలా ఉంటే, బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి తాజా చిత్రం `ఎఫ్ 3` మే 27న విడుదలకు సిద్ధమైంది.
![]() |
![]() |