![]() |
![]() |

చిన్నతనం నుంచీ కలిసి మెలిసి పెరిగిన తోబుట్టువు చనిపోతే కలిగే బాధ వర్ణనాతీతం. అలాంటి బాధనే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ అనుభవిస్తున్నాడు. అతని తమ్ముడు అనిల్ దేవ్‌గణ్ ఆకస్మికంగా మృతి చెందాడు. సోమవారం రాత్రి అనిల్ మృతి చెందాడని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈరోజు వెల్లడించాడు అజయ్. కొవిడ్-19 కారణంగా ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేయడం లేదని కూడా తెలియజేశాడు.
ట్విట్టర్ ద్వారా ఈ విషాద వార్తను షేర్ చేసుకున్న అజయ్, "గత రాత్రి నా సోదరుడు అనిల్ దేవగణ్‌ను కోల్పోయాను. అతని ఆకస్మిక మృతితో మా కుటుంబం హృదయం బద్దలైంది. అతని ఫ్యామిలీతో పాటు నేను అతను లేకపోవడాన్ని బాగా మిస్సవుతున్నాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. మహమ్మారి కారణంగా, వ్యక్తిగత ప్రార్థనా సమావేశాన్ని ఏర్పాటు చేయట్లేదు." అని ట్వీట్ చేశాడు.
వీరూ దేవగణ్ నలుగురు పిల్లల్లో అనిల్ ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనిల్ దేవగణ్ మూడు సినిమాలను డైరెక్ట్ చేశారు. వాటిలో రెండు సినిమాలు అన్న అజయ్‌తోనే చేశారు. అవి.. 'రాజు చాచా', 'బ్లాక్‌మెయిల్'. అలాగే 'మర్యాద రామన్న' రీమేక్ 'సన్నాఫ్ సర్దార్'కు క్రియేటవ్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఆయన వయసు 45 సంవత్సరాలు.
![]() |
![]() |