![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్‌లో డ్యాన్సింగ్ స్టైల్‌తో, జోవియల్ బిహేవియర్‌తో ఐదో వారం కూడా తన జర్నీకంటిన్యూ చేస్తున్నారు అమ్మ రాజశేఖర్. నోటి దురుసుతనం వివాదాలకు దారితీసినా చిన్నపిల్లాడి మనస్తత్వం మమతను పెంచేలా చేసింది. సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యారు రాజశేఖర్. యాక్టర్‌గానూ ప్రేక్షకులను అలరించిన ఆయన టీవీ రంగంలోనూ అడుగుపెట్టారు. డాన్స్ ప్రోగ్రామ్స్‌లో జడ్జిగా వ్యవహరించారు.
ఇప్పుడు రియాాల్టీ గేమ్ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో 11వ కంటెస్టెంట్‌గా టెలివిజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరియోగ్రాఫర్‌ను ఇండస్ట్రీలో మాస్టర్ అని పిలుస్తారు కాబట్టి, ఇక్కడా ఆయనను హోస్ట్ నాగార్జున సహా కంటెస్టెంట్లు అందరూ అలాగే గౌరవంగా పిలుస్తున్నారు. కాగా ఒకప్పుడు రణం లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసి, తర్వాత ఫేడవుట్ అయిపోయిన అమ్మ రాజశేఖర్‌కు బిగ్ బాస్ మంచి గుర్తింపు తీసుకువస్తున్నట్లే ఉంది.
బిగ్ హౌస్‌లో ఆయన జర్నీని పరిశీలిస్తే.. మొదటివారం డైరెక్టర్ సూర్యకిరణతో కలిసి హౌస్‌లో కలియతిరిగారు. ఇద్దరి మధ్య అదివరకే ఉన్న పరిచయం ఇప్పుడు దోస్తీగా మారింది. బిగ్ బాస్ ఇచ్చిన ఫిజికల్ టాస్క్ ల్లోనూ రాజశేఖర్ తన ప్రతిభను చూపించారు. టాస్క్ ల తర్వాత ఇంటిసభ్యులను ఇమిటేట్ చేస్తూ హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించారు. కట్టప్ప ఉన్నాడు అన్న బిగ్ బాస్ హెచ్చరికతో చాలామంది మాస్టర్‌ను కట్టప్ప అన్నారు. జోవియల్‌గా తీసుకుంటూ బిగ్ హౌస్‌లో క్లాస్, మాస్ అంటూ రెండు గ్రూప్ లు ఉన్నాయని కామెంట్ చేశారు. అంతేకాదు, ఇంటిసభ్యులను ఇమిటేట్ చేస్తూ ఆయన చేసే కామెడీ కొన్నిసార్లు హద్దుతీరిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీకెెండ్‌లో నాగార్జున కుళ్లు జోక్స్ ఆపి కాస్త నీట్‌గా ఉండండి అంటూ సూచించారు. సూర్యకిరణ్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఒంటరితనం ఫీల్ అయ్యారు మాస్టర్.
(1).jpg)
ఇక రెండోవారం సెల్ఫ్ నామినేషన్‌తో ఎలిమినేషన్ జాబితాలోకి ఆయన వచ్చారు. హౌస్‌లో కళ్యాణి, దివితో కాస్త కనెక్ట్ అయ్యారు. స్టోర్ మేనేజర్‌గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇంటిసభ్యుల అవసరాలను గమనిస్తూ అందరిలో ఒకడిగా మెదిలారు. మెహబూబ్ దివిని ఎత్తుకుని పోతుంటే అరే నా ఫిగర్‌ను ఎత్తుకు పోతున్నావు.. ఎవరినీ వదలవా.. ఈ అమ్మాయిని కాదు కరాటే కళ్యాణిని ఎత్తుకో అంటూ సెటైర్లు వేశారు మాస్టర్. టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ల డాన్సులకు కొరియోగ్రఫీ చేసి నాగ్ తో శభాష్ అనిపించుకున్నారు. స్కిట్స్ తో హాస్యం పండించారు. ఆ సమయంలో దేవి, అమ్మ రాజశేఖర్ మధ్య వాదన జరిగింది. గొంతు పెంచి మాట్లాడితే ఒప్పుకోనని దేవి అనగానే.. నీ వాయిస్ పెరిగితే ఏం లేదు కానీ నా వాయిస్ పెరిగితే మాత్రం తప్పొచ్చిందా? అంటూ దేవితో గొడవ పెట్టుకున్నారు రాజశేఖర్.
హీరో జీరో టాస్క్ లో దేవి, లాస్య ఆయనను జీరోగా చూపించారు. అయితే లాస్య చెప్పిన కారణంతో కన్నీళ్లు పెట్టుకున్నారు మాస్టర్. ఒక డైరెక్టర్ గా తాను అన్నింటిలో కల్పించుకుంటాను తప్ప తన మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉండవని చెప్పారు. కామెడీ చేస్తే హీరోలు అయిపోతారా? అంటూ దేవి కామెంట్ చేసింది. అంతేకాదు నాగార్జున ముందు కూడా కంప్లెయింట్ ఇచ్చింది. ఇంటి సభ్యుల్లో చాలామంది రాజశేఖర్‌ను సపోర్ట్ చేశారు. ఏ వ్యక్తి అందరికీ మంచివాడు కాదని.. కొందరికీ మంచివాడుగా.. మరికొందరికీ చెడ్డవాడుగా కనిపించవచ్చని నాగార్జున ఊరడించే ప్రయత్నం చేశారు. రాజశేఖర్ మాత్రం ఏడుస్తూ తనను హౌస్ నుంచి పంపించాలని కోరారు. గంగవ్వ ఆయన కన్నీళ్ళు తుడుస్తూ నేను పోయినా నువ్వు ఉండాలే అందరిని మంచిగ చూసుకుంటావు అంది. దాంతో ఎలిమినేషన్ నుంచి రాజశేఖర్ సేఫ్ అయ్యారు. కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు.
మూడోవారం ఉక్కుమనిషి టాస్క్ లో అమాయక రాజశేఖర్ అంటూ నాగార్జున చేత సింపతీ పొందారు మాస్టర్. టాస్క్ లో అవినాష్ తనను మోసం చేయడంతో ఆవేదన చెందిన రాజశేఖర్ లైఫ్‌లో నాశనం అయిపోతావు అంటూ తిడుతూ, తనతో మాట్లాడవద్దు అంటూ అవినాష్‌కు వార్నింగ్ ఇస్తూ తనలోని కోపాన్ని చూపించారు. దేవితో జీవితంలో మాట్లాడను అన్న మాస్టర్ ఆమె ఎలిమినేట్ అయ్యినప్పుడు మాత్రం చాలా బాధపడుతూ ఆమెను ఓదార్చారు. దాంతో ఆయన మనసులో ఎవరిపైనా కోపం ఉండదనీ, ఆయన ఆవేశం తాత్కాలికమేననీ ఇంటిసభ్యులు, ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు. కుళ్లు జోకులు తగ్గించుకుని కాస్త ఆరోగ్యకరమైన కామెడీని పంచుతున్నారు మాస్టర్. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ హౌస్ లోకి వచ్చిన స్వాతిని ఇంప్రెస్ చేయడంలో యూత్ తో పోటీపడ్డారు. బెస్ట్ ఫర్ఫార్మర్ గా ఆమె చేత గుర్తించబడి విందుకు ఆహ్వానం అందుకున్నారు. పార్టీలోనూ అదిరే స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు.
.jpg)
కొత్తగా వచ్చింది అంటూ నాలుగోవారం స్వాతిని నామినేట్ చేశాడు అమ్మ రాజశేఖర్. కాయిన్స్ టాస్క్ లోనూ మిగతా సభ్యులతో పోటీపడి కాయిన్స్ కలెక్ట్ చేయడంతో పాటు ఇతరుల నుంచి వాటిని దొంగిలించడంతోనూ చేతివాటం చూపించారు. ఆడపిల్లల వద్ద తీసుకోవద్దు అంటూ రూల్స్ పెట్టి తాను మాత్రం అరియానా వద్ద కాయిన్స్ కొట్టేశారు. తన వద్ద కాయిన్స్ కొట్టేసిన సోహైల్ తో పెద్ద గొడవే పెట్టుకున్నారు. జీవితంలో తనతో మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చారు. స్వాతి ఎలిమినేట్ అవుతూ తనను నామినేట్ చేసిన అమ్మ రాజశేఖర్ కు కెప్టెన్సీ పోటీలో ఉండే అర్హత లేదని బిగ్ బాంబ్ వేసింది.
ఇక ఐదోవారంలోనూ కాయిన్స్ టాస్క్‌లో కోపతాపాలు ప్రతిబింబించాయి. బిగ్ హౌస్ కెప్టెన్ కుమార్ సాయి కోరిక మేరకు రెండోసారి రేషన్ మేనేజర్ బాధ్యతను మాస్టర్ తీసుకున్నారు. అంతేకాదు ఎలిమినేష్ ప్రక్రియలో మాస్టర్ ను అఖిల్, అరియానా, నోయల్ నామినేట్ చేశారు. దాంతో రెండోసారి ఎలిమినేషన్ జాబితాలోకి చేరారు. ఒక్కొక్కవారం తనలోని ఒక్కక్క క్యారెక్టర్ ను బయటకు తీసుకువస్తున్న అమ్మ రాజశేఖర్ బిగ్ హౌస్ లో ఎన్ని వారాల పాటు కొనసాగుతారో వేచిచూడాల్సిందే.
- యశోద వంగా
.jpg)
![]() |
![]() |