![]() |
![]() |

వాళ్లు తిరిగొచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియో స్మాష్ హిట్ గ్యాంగ్‌స్టర్ సాగా 'మిర్జాపూర్' ఈసారి మరిన్ని గన్స్, మరింత గ్లోరీ, పగ, క్రూరమైన హింసతో సీజన్ 2 పేరుతో తిరిగొస్తోంది. వీక్షకులు దీని కోసం ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నారు.
ఫస్ట్ సీజన్ చివరలో ఊచకోత తర్వాత, మిర్జాపూర్‌ను ఏలే కలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), అతని కొడుకు మున్నా (దివ్యేందు) చేతుల్లో తమవాళ్ల ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రతీకారం కోసం గుడ్డు (అలీ ఫజల్), గోలు (శ్వేతా త్రిపాఠి శర్మ) చేసే ప్రయత్నాలు ఈ సీజన్ 2లో మనం చూడొచ్చు.

ట్రైలర్‌లో ఒక్కో కీలక పాత్ర పరిచయమవుతున్నప్పుడల్లా వాయిస్ ఓవర్ మారుతూ వస్తుంది. గత సీజన్‌లోని ఘటనలను ఆ పాత్ర గుర్తుకు తెస్తుంది. అలాగే గత సీజన్‌లో తన తండ్రి రతిశంకర్ శుక్లా చనిపోవడంతో పగ తీర్చుకోవడానికి రంగంలోకి వచ్చిన శరత్ (అంజుమ్ శర్మ) లాంటి, విజయ్ వర్మ పోషించిన పేరు తెలీని కొత్త పాత్రలు ఈ సీజన్‌లో పరిచయమవుతున్నాయి.
ట్రైలర్ చూస్తుంటే మునుపటి సీజన్ కంటే మరింత గ్రిప్పింగ్‌గా, మరింత యాక్షన్ అండ్ వయొలెన్స్ ఓరియెంటెడ్‌గా ఈ సీజన్ ఉంటుందనే అభిప్రాయం కలుగుతోంది. ఈసారి ఎగ్జయిటింగ్ కలిగించే విషయమేమంటే మిర్జాపూర్‌ను ఏలాలనుకుంటున్న గోలు క్యారెక్టర్ రైజ్ అవడం. మొత్తానికి ఈ సీజన్‌లో మనం ఫిమేల్ గ్యాంగ్‌స్టర్ ఏ విధంగా ఎదుగుతుందో చూసే అవకాశం ఉందనిపిస్తోంది.

అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, విజయ్ వర్మ, అంజుమ్ శర్మ లాంటి ప్రతిభావంతులైన నటులు మనకు తమ నటనా విన్యాసాలతో అలరించడం ఖాయం. పునీత్ కృష్ణ క్రియేట్ చేసిన ఈ కథను డైరెక్టర్స్ గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ తెరపైకి తీసుకొచ్చారు. అక్టోబర్ 23న ఈ సీజన్ విడుదలవుతోంది.

![]() |
![]() |