![]() |
![]() |

ఈ ఏడాది మే 20.. టాలీవుడ్ లో ఆసక్తికరమైన పోటీకి వేదిక కానుంది. ఆ రోజు సీనియర్ స్టార్ రాజశేఖర్, టాలెంటెడ్ స్టార్ సత్యదేవ్ తమ కొత్త చిత్రాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. తన శ్రీమతి జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ `శేఖర్`. మలయాళ చిత్రం `జోసెఫ్` (2018)కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో `జార్జిరెడ్డి` ఫేమ్ ముస్కాన్ కథానాయికగా నటించగా.. రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనుంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించిన ఈ చిత్రం.. వేసవి కానుకగా మే 20న విడుదలకు సిద్ధమైంది. ప్రచార చిత్రాలతో, పాటలతో ఆసక్తి రేపిన ఈ సినిమా.. నటుడిగా రాజశేఖర్ కి 91వ చిత్రం.
కట్ చేస్తే.. అదే మే 20న సత్యదేవ్ నటించిన సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఆ చిత్రమే.. 'గాడ్సే'. 'బ్లఫ్ మాస్టర్' (2018) తరువాత గోపీ గణేశ్ దర్శకత్వంలో సత్యదేవ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించిన ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతమందించాడు. మరి.. రాజశేఖర్ వర్సెస్ సత్యదేవ్ అన్నట్లుగా ఉన్న మే 20 బాక్సాఫీస్ వార్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |