![]() |
![]() |
.webp)
ఒకే కథని రెండు భాగాలుగా రూపొందించి.. బాక్సాఫీస్ ముంగిట సంచలనాలు సృష్టించడం అనే ప్రక్రియ `బాహుబలి` సిరీస్ తో ఊపందుకుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సిరీస్.. `బాహుబలి - ది బిగినింగ్` (2015), `బాహుబలి - ది కంక్లూజన్` (2017) టైటిల్స్ తో జాతీయ స్థాయిలో కాసుల పంట పండించింది.
జక్కన్న సక్సెస్ ఫుల్ ఫార్ములాతోనే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా `కేజీఎఫ్` కథను రెండు భాగాలుగా తీర్చిదిద్దారు. ఫస్ట్ పార్ట్ `కేజీఎఫ్ః చాప్టర్ 1` (2018) చరిత్ర సృష్టిస్తే.. సెకండ్ పార్ట్ `కేజీఎఫ్ః చాప్టర్ 2` (2022) అంతకు మించిన విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. అటు `బాహబలి` సిరీస్, ఇటు `కేజీఎఫ్` సిరీస్.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ కావడం గమనార్హం.
ఇదిలా ఉంటే, `బాహుబలి`, `కేజీఎఫ్` సిరీస్ తరహాలోనే రెండు భాగాల కథతో రూపొందుతున్న మరో పాన్ - ఇండియా సిరీస్ `పుష్ప`. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ క్రేజీ సిరీస్ నుంచి ఇప్పటికే తొలి భాగం `పుష్ప - ద రైజ్` (2021) విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. త్వరలో మలి భాగం `పుష్ప - ద రూల్` సెట్స్ పైకి వెళ్ళనుంది. మరి.. జక్కన్న, ప్రశాంత్ నీల్ లాగే సుక్కు కూడా రెండో భాగంతోనూ మెప్పిస్తాడేమో చూడాలి.
కాగా, అల్లు అర్జున్ - రష్మిక జంటగా నటించనున్న `పుష్ప - ద రూల్` వచ్చే ఏడాది ప్రథమార్ధంలో జనం ముందుకు వచ్చే అవకాశముంది.
![]() |
![]() |