![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విజయోత్సాహంలో ఉన్న ఇద్దరు హీరోలు దైవ భక్తిలో మునిగిపోయారు. ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష చేపట్టే చరణ్ ఈ ఏడాది కూడా 'ఆర్ఆర్ఆర్' విడుదల సమయంలో దీక్ష చేపట్టారు. అయితే తాజాగా తారక్ కూడా హనుమాన్ దీక్ష చేపట్టడం విశేషం.
మొట్టమొదటిసారి హనుమాన్ దీక్షను చేపట్టారు తారక్. 21 రోజుల పాటు ఉండే అర్థమండల దీక్షను ఆయన చేపట్టారు. హనుమాన్ దీక్షలో ఉన్న తారక్ తాజాగా ఫ్యాన్స్ తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. కాషాయ దుస్తులు, మెడలో హనుమాన్ మాల, నుదుటిన సిందూరంతో తారక్ లుక్ ఆకట్టుకుంటోంది.

తారక్ తన తదుపరి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమా జూన్ లో పట్టాలెక్కనుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు తారక్.
![]() |
![]() |