![]() |
![]() |

'ఆచార్య' సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చిందేసిన 'భలే భలే బంజారా' సాంగ్ రేపు(సోమవారం) విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సాంగ్ ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. 'భలే భలే బంజారా' అంటూ చిరంజీవి, చరణ్ కలిసి డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంటోంది.
'భలే భలే బంజారా' సాంగ్ మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పొచ్చు. ప్రోమోలో నక్సల్స్ గెటప్ లో చిరంజీవి, చరణ్ కలిసి వేసిన డ్యాన్స్ కన్నుల పండుగలా ఉంది. ఇక సినిమాలో ఫుల్ సాంగ్ మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో 'ఖైదీ నెం.150' సినిమాలో చిరంజీవి, చరణ్ కలిసి డ్యాన్స్ చేశారు. అయితే ఫుల్ సాంగ్ లో కలిసి డ్యాన్స్ చేయడం ఇదే మొదటసారి.
మణిశర్మ సంగీతం అందించిన 'భలే భలే బంజారా' సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటించారు.
![]() |
![]() |