![]() |
![]() |

'కేజీఎఫ్ చాప్టర్-2' మూవీ కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటింది. అయితే 'ఆర్ఆర్ఆర్'తో పోల్చి చూస్తే ఇవి తక్కువ కావడం విశేషం. ఆర్ఆర్ఆర్ మూడు రోజుల్లో 280 కోట్లకు పైగా షేర్ రాబట్టగా 'కేజీఎఫ్-2' 206 కోట్లు కలెక్ట్ చేసింది. హిందీలో మాత్రం 'కేజీఎఫ్-2' హవానే కనిపిస్తోంది. నాలుగో వారంలోకి అడుగుపెట్టిన ఆర్ఆర్ఆర్ 250 కోట్ల నెట్ కి చేరువ అవుతుంటే.. కేజీఎఫ్-2 మాత్రం మొదటి వారమే 250 కోట్లు రాబట్టే అవకాశముంది అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 19.09 కోట్లు, రెండో రోజు 13.37 కోట్లు, మూడో రోజు 10.29 కోట్లు కలెక్ట్ చేసిన కేజీఎఫ్-2 మూడు రోజుల్లో 42.75 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 85.60 కోట్ల షేర్(164.20 కోట్ల గ్రాస్), రెండో రోజు 66.18 కోట్ల షేర్(128.90 కోట్ల గ్రాస్) , మూడో రోజు 55.14 కోట్ల షేర్(117.10 కోట్ల గ్రాస్) రాబట్టిన కేజీఎఫ్-2 మూడో రోజుల్లో 206.92 కోట్ల షేర్(410.20 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.
మూడు రోజుల్లో కర్ణాటకలో 42.90 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 42.75 కోట్లు, తమిళనాడులో 11.42 కోట్లు, కేరళలో 8.60 కోట్లు, హిందీ+రెస్టాఫ్ ఇండియా 74.15 కోట్లు, ఓవర్సీస్ 27.10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 345 కోట్ల బిజినెస్ చేసిన కేజీఎఫ్-2 మూడు రోజుల్లోనే దాదాపు 60 శాతం రాబట్టింది.
![]() |
![]() |