![]() |
![]() |

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది ఈ మూవీ. తాజాగా మరో కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాని మే 6 న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ని వదిలారు. ఇందులో పెళ్లీడు దాటిపోయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కి సిద్ధమైన అర్జున్ పాత్రలో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది.

ఆగష్టు 22 న చిరంజీవి 'ఆచార్య' మూవీ, మే 12 న మహేష్ బాబు 'సర్కారు వారి పాట' మూవీ ఉన్నాయి. ఆచార్య, సర్కారు వారి పాట వంటి భారీ సినిమాల మధ్య విడుదల అవుతున్న 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
![]() |
![]() |