![]() |
![]() |

చరిత్ర పురుషులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్నేహం చుట్టూ అల్లుకున్న కల్పిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సిసలైన మల్టిస్టారర్ ని డైరెక్టర్ నంబర్ వన్ యస్. యస్. రాజమౌళి రూపొందిస్తున్నారు. డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ మాగ్నమ్ ఓపస్ కి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ఈ సినిమా చిత్రీకరణలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో రామరాజు పాత్రధారి రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో దర్శనమివ్వనుంది అలియా. కాగా, ప్రస్తుతం అలియాపై కొన్ని ఎమోషనల్ సీన్స్ ని పిక్చరైజ్ చేస్తున్నారని టాక్. ఈ సన్నివేశాల్లో మిస్ భట్ అభినయం గుర్తుండిపోయేలా ఉంటుందని ఇన్ సైడ్ ఇన్ ఫర్మేషన్.
కాగా, 2021 ద్వితియార్ధంలో ఆర్ ఆర్ ఆర్.. వెండితెరపై వెలుగులు పంచనుంది.
![]() |
![]() |