![]() |
![]() |

యంగ్ టైగర్ యన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించి తన షూటింగ్ పార్ట్ పూర్తవగానే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంది. అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తోనూ యన్టీఆర్ ఓ మూవీ చేయబోతున్నారని చాన్నాళ్ళుగా ప్రచారం జోరుగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తుందని బజ్.
ఇదిలా ఉంటే.. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన హిట్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శైలేష్ కొలను కాంబినేషన్ లోనూ తారక్ ఓ సినిమా చేయబోతున్నారని టాక్. దిల్ రాజుకి శైలేష్ చెప్పిన కథ నచ్చడం.. యన్టీఆర్ తో చర్చలు జరపడం.. స్క్రిప్ట్ నచ్చి తారక్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఇలా ఈ ప్రాజెక్ట్ తాలూకు వ్యవహారమంతా చకచకా జరిగిపోయిందని ఇన్ సైడ్ ఇన్ ఫర్మేషన్. మరి.. తారక్, శైలేష్ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |