![]() |
![]() |

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో ఆడిపాడిన ఉత్తరాది భామ కియారా అద్వాని.. బాలీవుడ్ లోనూ అదే దిశగా పయనిస్తోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోతో అక్కడ ఆడిపాడిన మిస్ అద్వాని.. త్వరలో బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ తోనూ జట్టుకట్టబోతోందట. అది కూడా.. క్రిష్ సిరీస్ లో..
ఆ వివరాల్లోకి వెళితే.. గత ఏడాది సూపర్ 30, వార్ చిత్రాలతో బౌన్స్ బ్యాక్ అయిన హృతిక్.. తన తదుపరి చిత్రంగా క్రిష్ - 4 చేయనున్నారట. క్రిష్ ఫ్రాంచైజీలో తొలి మూడు భాగాలకు దర్శకత్వం వహించిన హృతిక్ తండ్రి, వెటరన్ డైరెక్టర్ రాకేష్ రోషన్ నే నాలుగో భాగాన్ని కూడా రూపొందించనున్నారు. ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో తొలుత ఓ హీరోయిన్ గా కృతి సనన్ ని అనుకున్నారు. అయితే కాల్షీట్ల సమస్యతో కృతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. ఇప్పుడా అవకాశం కియారాకి దక్కిందని బాలీవుడ్ ఖబర్.
మరి.. ఈ ఛాన్స్ ని కియారా ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. త్వరలోనే క్రిష్ - 4లో కియారా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
![]() |
![]() |