![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్, దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్'. పునీత్ జయంతి సందర్భంగా మార్చి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పునీత్ అభిమానులతో పాటు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
జేమ్స్ సినిమాకి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1వ తేదీన జేమ్స్ చిత్రం నుండి 'ట్రేడ్ మార్క్' సాంగ్ లిరికల్ వీడియో ని మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'ట్రేడ్ మార్క్' సాంగ్ కూడా అదే స్థాయిలో అలరిస్తుందేమో చూడాలి.

జేమ్స్ లో హీరోయిన్గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 17న కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. పునీత్ కి నివాళిగా కర్ణాటక ఎగ్జిబిటర్లు రాష్ట్రంలో జేమ్స్ కాకుండా మరే ఇతర సినిమాను ఒక వారం పాటు ప్రదర్శించకూడదని నిర్ణయించారు.
![]() |
![]() |