![]() |
![]() |

ఈ తరం కథానాయికల్లో నిత్యా మీనన్ తీరే వేరు. నిడివితో సంబంధం లేకుండా అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రల్లోనే ఎక్కువగా దర్శనమిస్తుంటుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. ఈ ఫిబ్రవరి 25న రిలీజైన `భీమ్లా నాయక్` చిత్రంతో మరోమారు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేసింది ఈ చక్కనమ్మ. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషించిన భీమ్లా నాయక్ కి జోడీ అయిన సుగుణ పాత్రలో భలేగా అలరించింది నిత్య. ఫైర్ బ్రాండ్ లాంటి ఆ వేషంలో తన యాక్టింగ్ స్కిల్స్ తో ఇంప్రెస్ చేసింది. సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది.
Also Read: 'పుష్ప' కంటే ఎక్కువ.. 'వకీల్ సాబ్' కంటే తక్కువ
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తెలుగునాట నిత్యా మీనన్ కి ఫిబ్రవరి మాసం భలేగా అచ్చొచ్చింది. ఈ నెలలో వేర్వేరు సంవత్సరాల్లో రిలీజైన `ఇష్క్` (2012), `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` (2015), `అ!` (2018), `నిన్నిలా నిన్నిలా` (2021) వంటి చిత్రాలు నిత్యా మీనన్ కి నటిగా మంచి పేరు తీసుకువచ్చాయి. ఇప్పుడు `భీమ్లా నాయక్` రూపంలో మరోసారి ఫిబ్రవరి నెల వేదికగా మెప్పించింది నిత్య. మరి.. భవిష్యత్ లోనూ ఈ నెలలో మరపురాని పాత్రలతో, చిత్రాలతో ఈ ముద్దుగుమ్మ ఎంటర్టైన్ చేస్తుందేమో చూడాలి.
![]() |
![]() |