![]() |
![]() |

శర్వానంద్, రష్మికా మందన్న జంటగా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా మార్చి 4న విడుదలవుతోంది. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. విడుదలకు ముందే ఈ చిత్రంలోని పాటలు పాపులర్ అయ్యాయి. ఆదివారం రాత్రి జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ సుకుమార్, తారలు కీర్తి సురేశ్, సాయిపల్లవి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ రష్మిక, సాయిపల్లవి, కీర్తి, సమంతలను ప్రశంసించాడు.
"అందమైన నాయికలు రష్మిక, సాయిపల్లవి, కీర్తిసురేశ్. ముగ్గురూ బెస్ట్ పెర్‌ఫామ్ చేస్తారు. వీరికి సమంత గ్యాంగ్ లీడర్. సాయిపల్లవి లేడీ పవన్ కళ్యాణ్‌లా కనిపిస్తారు. ఈ రంగంలో తనలా వుండడం కష్టం. మానవతా కోణంలో ఆలోచించి ఒక వాణిజ్య ప్రకటనను రిజక్ట్ చేయడంలో సాయి పల్లవి ఆదర్శంగా నిలుస్తారు." అని ఆయన అన్నాడు.
సాయిపల్లవిని సుకుమార్ లేడీ పవన్ కల్యాణ్ అని మెచ్చుకుంటే, శర్వా కూడా ఆమె గురించి చాలా బాగా మాట్లాడటం గమనార్హం. "సుకుమార్‌కు నేను అభిమానిని. ఆయన వచ్చి ఆశీర్వదించడం ఆనందంగా వుంది. కీర్తి గారికి ధన్యవాదాలు. సాయిపల్లవిని నటిగా చూడను. తను మనసుతో మాట్లాడే వ్యక్తి. మంచి స్నేహితురాలు." అని చెప్పాడు. అంతకు ముందు, స్టేజిపై సాయిపల్లవి, కీర్తి, రష్మికకు మోకాళ్లపై కూర్చొని బొకేను అందించాడు శర్వా. ముగ్గురు తారలూ నవ్వుతూ దాన్నందుకున్నారు.
ఆ తర్వాత తన స్పీచ్ కొనసాగిస్తూ, "ఈ సినిమాకు దేవి శ్రీ ప్రాణం పోశాడు. 15 ఏళ్ళనాడు దేవి ఓ మాట ఇచ్చాడు. 'నీకు సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ ఇస్తాను' అన్నాడు. అది ఈ సినిమాతో నెరవేర్చాడు. ఈ సినిమాలో గొప్ప నటులతో నటించే అవకాశం కలిగింది. సుధాకర్‌గారి వల్లే ఈ సినిమా చేశాను. ఆయన నన్ను నమ్మారు. రాసుకోండి.. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది. మార్చి 4న వస్తున్నాం. ఇంతకాలం మిస్ అయిన ఫ్యామిలీ సినిమాను మీకోసం ఇస్తున్నాం. ఇక రష్మిక ఎప్పుడూ నవ్వుతూనే వుంటుంది. ఆమెతో నటించడం ఆనందంగా వుంది. థియేటర్‌కు వచ్చి సినిమా చూశాక నవ్వుకుంటూ బయటకు వెళతారు అని గట్టిగా చెప్పగలను" అని అన్నాడు.
పల్లవి మాట్లాడుతూ, "ఈరోజు నా కుటుంబ వేడుకకు వచ్చినట్లు వుంది. 'పడిపడి లేచె మనసు' చేసినప్పటి నుంచి నిర్మాతలు నా కుటుంబ సభ్యులు అయిపోయారు. శర్వాతో స్నేహితురాలిగా మాట్లాడతాను. శర్వాకు హీరో అయిపోయానని కాకుండా తను బాగా వినోదాన్ని పంచాలను ప్రయత్నిస్తుంటాడు." అని చెప్పింది.
![]() |
![]() |