![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ లో నటించిన `ఖిలాడి`లో ఓ హీరోయిన్ గా కనువిందు చేసింది డింపుల్ హయాతి. అంతకంటే ముందు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ `గద్దలకొండ గణేశ్`లో ``జర్ర జర్ర`` అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో తన చిందులతో ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం ఈ తెలుగమ్మాయి.. మ్యాచో స్టార్ గోపీచంద్ - దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ మూవీలో కథానాయికగా నటిస్తోంది.
ఇదిలా ఉంటే, డింపుల్ ఖాతాలో తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేరిందట. ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని ఓ యాక్షన్ డ్రామా తీస్తున్న సంగతి తెలిసిందే. చెన్నై పొన్ను శ్రుతి హాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ సెకండ్ లీడ్ గా కనిపించనుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో కథానుసారం ఓ ఐటమ్ సాంగ్ కి స్కోప్ ఉందట. ఆ పాటలో డింపుల్ హయాతిని నర్తింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అదే గనుక నిజమైతే.. డింపుల్ కి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మరి.. బాలయ్యతో చేయబోయే ఈ స్పెషల్ సాంగ్.. డింపుల్ కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |