![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బీబీ3 (వర్కింగ్ టైటిల్) చేస్తున్నారు. 2021 వేసవిలో ఈ యాక్షన్ డ్రామా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ లోపే మరిన్ని ప్రాజెక్ట్స్ కి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారని సమాచారం. బి. గోపాల్, శ్రీవాస్, సంతోష్ శ్రీనివాస్, సాగర్ చంద్ర, అనిల్ రావిపూడి.. ఇలా ఎప్పటికప్పుడు బాలయ్య ఖాతాలో దర్శకుల జాబితా పెరుగుతూనే ఉంది.
ఇదిలా ఉంటే.. డిక్టేటర్ తరువాత శ్రీవాస్ దర్శకత్వంలో నటసింహ చేయనున్న కొత్త సినిమా.. 2021 సంక్రాంతికి ప్రారంభం కానుందని టాక్. అంతేకాదు.. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కథను సమకూర్చుతున్నారని తెలిసింది. త్వరలోనే బాలయ్య, శ్రీవాస్ మూవీకి సంబంధించి మరింత సమాచారం వెలువడే అవకాశముంది. మరి.. డిక్టేటర్ తో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ కాంబో.. రాబోయే సినిమాతోనైనా బాక్సాఫీస్ ని ఇంప్రెస్ చేస్తారేమో చూడాలి.
![]() |
![]() |