![]() |
![]() |

శృంగార తారగా పేరుపొందిన మలైకా అరోరా షేర్ చేసిన ఫొటోలు ఆన్‌లైన్‌లో హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె గోవాలోని తన చెల్లెలు అమృతా అరోరా బీచ్ హౌస్ దగ్గర సెలవుల్ని గడుపుతోంది. ఆమెతో పాటు యంగ్ బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి వారు రెడీ అవుతున్నారు.
బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ పిక్చర్‌ను షేర్ చేసిన మలైకా, దానికి “Tropical paradise ......” (భూతల స్వర్గం) అనే క్యాప్షన్ పెట్టింది. ఆ పిక్చర్‌లో గ్రీన్ డ్రస్‌లో అదరగొడుతోంది మలైకా. ఒక మొక్క దగ్గర నిల్చొని అరిటాకుల తరహాలో ఉన్న ఆకులను పట్టుకొని కెమెరాకు పోజ్ ఇచ్చిందామె. మెడలో ‘M’ అనే పెండెంట్ మెరుస్తోంది.
.jpg)
.jpg)
మరోవైపు అర్జున్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో టేబుల్‌పై ఓ వైట్ ఫ్లవర్ పెట్టిన పిక్చర్‌ను షేర్ చేశాడు. అంతకుముందు వారి బీచ్ హౌస్‌లోని లివింగ్ రూమ్ నుంచి అమృత, ఆమె భర్తను ప్రశంసిస్తూ పిక్చర్స్ షేర్ చేశాడు అర్జున్. ఇటీవల మలైకా, అర్జున్ కలిసి కరీనా, సైఫ్ అలీఖాన్‌లతో దీవాళీ సెలవుల్ని హిమాచల్ ప్రదేశ్‌లోని హిల్ ఏరియా మెక్‌లియోడ్‌గంజ్‌లో గడిపారు. అక్కడ సైఫ్, అర్జున్ కలిసి నటిస్తోన్న 'భూత్ పోలీస్' షూటింగ్ జరుగుతోంది.

![]() |
![]() |