![]() |
![]() |

యువసామ్రాట్ అక్కినేని నాగార్జున (nagarjuna) తాజా చిత్రం నా సామి రంగ. జనవరి 14 న విడుదల అవుతున్న ఈ మూవీ కోసం నాగ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో యువ నటుడు రాజ్ తరుణ్ కూడా ఒక ముఖ్య పాత్రని పోషిస్తున్నాడు. తాజాగా చిత్ర బృందం రాజ్ తరుణ్ పాత్రని పరిచయం చేస్తు వదలిన గ్లింప్స్ తో సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో తెలుస్తుంది.
రాజ్ తరుణ్ (Raj tarun)తన పక్కనే కూర్చున్న రుక్సార్ థ్రిల్లన్( rukhsar thillan) ని చూస్తు తన నవ్వు కోసం చైనా గోడని అయినా దూకవచ్చు అని అంటాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ చెప్పిన ఈ ఒక్క డైలాగ్ తో నా సామి రంగ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తి అందరిలోను రెట్టింపు అయ్యింది. అలాగే ఆ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. భాస్కర్ అనే కాలేజ్ స్టూడెంట్ పాత్రలో రాజ్ తరుణ్ ఈ మూవీలో మెరవనున్నాడు.

నాగార్జున సరసన ఆషిక రంగనాధ్ (ashika ranganath) హీరోయిన్ గా నటిస్తున్న ఈ నా సామిరంగ (naa saami ranga)లో రాజ్ తరుణ్, రుక్సార్ థ్రిల్లన్ లతో పాటు అల్లరి నరేష్ (allari naresh) కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. బెజవాడ ప్రసన్నకుమార్ (bejawada prasanna kumar) కథ మాటలు అందిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ (vijay binni) దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందించారు.
![]() |
![]() |