![]() |
![]() |

తెలుగు హీరోలకు అందని ద్రాక్షలా ఉన్న జాతీయ అవార్డును 'పుష్ప' సినిమాతో సాకారం చేశాడు అల్లు అర్జున్. దీంతో బన్నీ తర్వాత నేషనల్ అవార్డు అందుకోగల తెలుగు హీరో ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే రామ్ చరణ్ అభిమానులు మాత్రం నెక్స్ట్ ఆ ఫీట్ సాధించేది తమ హీరోనే అని నమ్మకంగా చెబుతున్నారు.
తన 15వ సినిమా 'గేమ్ ఛేంజర్'ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రామ్ చరణ్.. 16వ సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్నాడు. ఈ మూవీ వేసవిలో పట్టాలెక్కే అవకాశముంది. దీని కోసం చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా బుచ్చిబాబుతో చరణ్ దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్లద్దాలు పెట్టుకొని క్లాస్ గా ఉన్న చరణ్ లుక్ ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాదు #RamCharan, #RC16 హ్యాష్ ట్యాగ్ లను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
.webp)
#RC16 మూవీ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. 'రంగస్థలం'లో చిట్టిబాబు పాత్ర చరణ్ కి ఎంత పేరు తీసుకువచ్చిందో.. అంతకుమించిన పేరు RC16 తీసుకువస్తుందని అంటున్నారు. ఇక చరణ్ ఫ్యాన్స్ అయితే 'రంగస్థలం' సినిమాకి నేషనల్ అవార్డు మిస్ అయిందని, కానీ ఈసారి #RC16 కి ఖచ్చితంగా వస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.
![]() |
![]() |