![]() |
![]() |

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో భాగమవ్వడం అంటే.. ఏ టెక్నీషియన్ కైనా అది గోల్డెన్ ఛాన్సే. ఇప్పటికే మోహన్ లాల్, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్, రామ్ చరణ్, రవితేజ వంటి స్టార్స్ తో కలిసి పనిచేసిన ఓ కెమెరామేన్ కి కూడా అలాంటి `సూపర్` ఛాన్స్ దక్కిందట.
ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ యంగ్ కెప్టెన్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేసన్ లో ఓ సినిమా చేయబోతున్నారు రజినీకాంత్. `తలైవర్ 169` అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బ్యూటీ ఐకాన్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ నాయికగా నటించనుందని టాక్. కాగా, ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస సెలెక్ట్ అయ్యాడని సమాచారం. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న నెల్సన్ చిత్రం `బీస్ట్`కి మనోజ్ నే ఛాయాగ్రాహకుడు. అతని పనితీరు నచ్చడంతో.. రజినీ సినిమాకి కూడా కొనసాగించే ఆలోచనలో ఉన్నాడట నెల్సన్. త్వరలోనే `తలైవర్ 169`లో మనోజ్ పరమహంస ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. ఇప్పటివరకు రజినీకాంత్ తో సినిమా చేయని మనోజ్.. ఈ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.
కాగా, తెలుగులో `ఏమాయ చేసావె`, `రేసు గుర్రం`, `కిక్ 2`, `బ్రూస్ లీ` చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించాడు మనోజ్. త్వరలో రిలీజ్ కానున్న పాన్ - ఇండియా మూవీ `రాధే శ్యామ్`కి కూడా ఇతనే కెమెరామేన్.
![]() |
![]() |