![]() |
![]() |

అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య నటించిన 'బంగార్రాజు' సినిమా సంక్రాంతికి థియేటర్స్ లో విడుదలై విజయం సాధించింది. ఇక ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది.
నాగార్జున, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ మూవీ 'సోగ్గాడే చిన్ని నాయనా(2016)'కు సీక్వెల్ గా తెరకెక్కింది 'బంగార్రాజు'. సోగ్గాడేలో నాగ్ డ్యూయల్ రోల్ పోషించగా.. బంగార్రాజులో నాగ్ తో పాటు చైతన్య నటించడం విశేషం. ఈ అక్కినేని సోగ్గాళ్లు సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేశారు. ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో సందడి చేస్తున్నారు. ఓటీటీ వేదిక జీ5 లో ఫిబ్రవరి 18 నుంచి బంగార్రాజు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన వారం రోజుల్లోనే 500 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది ఈ సినిమా. ఈ మేరకు జీ5 ఒక పోస్టర్ ను విడుదల చేసింది.
.webp)
'బంగార్రాజు'లో నాగ్ కి జోడీగా రమ్యకృష్ణ, చైతన్య సరసన కృతి శెట్టి నటించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.
![]() |
![]() |