![]() |
![]() |

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి సినిమా 'జేమ్స్'. మార్చి 17న పునీత్ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారని తెలుస్తోంది.
'జేమ్స్' ప్రీరిలీజ్ ఈవెంట్ మార్చి 6న కర్ణాటకలోని హోస్పేట్ లో జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ నుండి ప్రత్యేక అతిధులుగా చిరంజీవి, తారక్ హాజరుకానున్నారని సమాచారం. పునీత్ కుటుంబానికి టాలీవుడ్ స్టార్స్ తో మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మెగా, నందమూరి కుటుంబాలతో వారి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. తారక్ ని అయితే సోదరుడిలా భావించేవాడు పునీత్. అంతేకాదు, పునీత్ సినిమాలో ఒక సాంగ్ కూడా పాడాడు తారక్. పునీత్ అంత్యక్రియల్లో కూడా ఎందరో టాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. ఇప్పుడు పునీత్ చివరి సినిమా వేడుకలో చిరంజీవి, తారక్ పాల్గొనబోతున్నారనే న్యూస్ వైరల్ గా మారింది.

కాగా, పునీత్ కి నివాళిగా కర్ణాటక ఎగ్జిబిటర్లు రాష్ట్రంలో జేమ్స్ కాకుండా మరే ఇతర సినిమాను ఒక వారం పాటు ప్రదర్శించకూడదని నిర్ణయించారు. 'జేమ్స్' మూవీకి చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా.. ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించింది. కిషోర్ పత్తికొండ ఈ సినిమాని నిర్మించారు.
![]() |
![]() |