![]() |
![]() |

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సినిమాలలో 'రామారావు ఆన్ డ్యూటీ' ఒకటి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ టీజర్ ని మార్చి 1 న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ని వదిలారు. అందులో రవితేజ లుక్ పవర్ ఫుల్ గా లుక్ ఉంది. పోస్టర్ ని బట్టి చూస్తే అదొక ఫైట్ సీన్ లో స్టిల్ అని అర్థమవుతోంది. ఇటీవల 'ఖిలాడి'తో నిరాశపరిచిన రవితేజ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాపై రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన సోషల్ మీడియాలో హ్యాండిల్స్ లో 'రవితేజ ఆన్ డ్యూటీ' అని పేరు మార్చుకోవడం విశేషం. ఈ మూవీని మార్చి 25 లేదా ఏప్రిల్ 15 న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా' అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అలాగే సుధీర్ వర్మ డైరెక్షన్ లో 'రావణాసుర' చేస్తున్నాడు. వీటితో పాటు వంశీ దర్శకత్వంలో 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా చేయనున్నాడు.
![]() |
![]() |