![]() |
![]() |

తెలుగునాట తనదైన ముద్ర వేసిన ఛాయాగ్రాహకుల్లో మనోజ్ పరమహంస ఒకరు. నాగచైతన్య, సమంత జంటగా నటించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా `ఏమాయ చేసావె`తో ఇక్కడి ప్రేక్షకులను తొలిసారిగా పలకరించిన మనోజ్.. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆపై అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందిన `రేసు గుర్రం`తో టాలీవుడ్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే, ఆ తరువాత మనోజ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన తెలుగు చిత్రాలు `కిక్ 2` (రవితేజ), `బ్రూస్ లీ`(రామ్ చరణ్) నిరాశపరిచాయి.
`బ్రూస్ లీ` అనంతరం ఇతర దక్షిణాది భాషా చిత్రాల వైపే ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ కోలీవుడ్ సినిమాటోగ్రాఫర్.. త్వరలో మరో తెలుగు సినిమాతో పలకరించబోతున్నాడు. ఆ చిత్రమే.. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ - ఇండియా రొమాంటిక్ డ్రామా `రాధే శ్యామ్`. `జిల్` రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ పిరియడ్ లవ్ సాగా.. మార్చి 11న థియేటర్స్ లోకి రాబోతోంది. మరి.. గత రెండు తెలుగు చిత్రాలతో ట్రాక్ తప్పిన మనోజ్.. `రాధే శ్యామ్`తోనైనా టాలీవుడ్ లో మళ్ళీ విజయం అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |