![]() |
![]() |

తెలుగునాట తొలుత రచయితగా, ఆపై దర్శకుడిగా స్టార్ డమ్ చూసిన వైనం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంతం. మెగాఫోన్ పట్టాక పరిమిత సంఖ్యలోనే ఇతర దర్శకుల చిత్రాలకు రచయితగా పనిచేశారు త్రివిక్రమ్. కెప్టెన్ అయ్యాక `మన్మథుడు`, `మల్లీశ్వరి`, `జై.. చిరంజీవ!`, `తీన్ మార్`, `భీమ్లా నాయక్`.. ఇలా బిగ్ టికెట్ ఫిల్మ్స్ కి మాత్రమే సంభాషణల రచయితగా వర్క్ చేశారు త్రివిక్రమ్. వీటిలో చివరి రెండు సినిమాలను తన లక్కీ హీరో, ఫ్రెండ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం చేశారు త్రివిక్రమ్.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అటు `తీన్ మార్`, ఇటు `భీమ్లా నాయక్` రెండు కూడా రీమేక్ మూవీస్ నే. జయంత్ సి. పరాన్జీ డైరెక్ట్ చేసిన `తీన్ మార్` హిందీ చిత్రం `లవ్ ఆజ్ కల్`కి రీమేక్ కాగా.. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన `భీమ్లా నాయక్` మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్ వెర్షన్. ఈ రెండు సినిమాలకు కేవలం మాటలను అందించడమే కాకుండా స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు త్రివిక్రమ్. అయితే, వీటిలో `తీన్ మార్` నిరాశపరచగా, `భీమ్లా నాయక్` మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని విజయపథంలో పయనిస్తోంది. మొత్తమ్మీద.. తను డైరెక్ట్ చేయని సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన రెండు సందర్భాల్లోనూ పవన్ కథానాయకుడిగా నటించడం.. వాటిలో ఒకటి ఫ్లాప్, మరొకటి సక్సెస్ కావడం వార్తల్లో నిలిచే అంశమనే చెప్పాలి.
![]() |
![]() |