![]() |
![]() |

తెలుగు చిత్ర పరిశ్రమలో `డబుల్ హ్యాట్రిక్` హిట్స్ అందుకున్న అతి కొద్దిమంది కథానాయకుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. `గోకులంలో సీత`, `సుస్వాగతం`, `తొలిప్రేమ`, `తమ్ముడు`, `బద్రి`, `ఖుషి` చిత్రాలతో కెరీర్ ఆరంభంలో వరుసగా ఆరు విజయాలను సొంతం చేసుకున్నారు పవన్. ఆపై వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాల్లో `జల్సా`, `గబ్బర్ సింగ్`, `అత్తారింటికి దారేది`, `వకీల్ సాబ్`, `భీమ్లా నాయక్` మాత్రమే బాక్సాఫీస్ విన్నర్స్ గా నిలిచాయి.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `ఖుషి` తరువాత వచ్చిన చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడమే అరుదైన తరుణంలో.. తన రి-ఎంట్రీ అనంతరం వచ్చిన `వకీల్ సాబ్`, `భీమ్లా నాయక్`తో కథానాయకుడిగా రెండు వరుస విజయాలు చూశారు పవర్ స్టార్. ఈ నేపథ్యంలో.. పవన్ నెక్స్ట్ వెంచర్ `హరిహర వీరమల్లు`పై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ పిరియడ్ డ్రామా.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ పాన్ - ఇండియా మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. మరి.. `ఖుషి` తరువాత వచ్చిన సినిమాలతో మళ్ళీ హ్యాట్రిక్ కొట్టని పవన్.. `వకీల్ సాబ్`, `భీమ్లా నాయక్` వంటి హిట్స్ తరువాత రాబోతున్న `హరిహర వీరమల్లు`తోనైనా ఆ ఫీట్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.
![]() |
![]() |