![]() |
![]() |

ఇటీవల విడుదలైన 'డీజే టిల్లు' సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మూవీ టైటిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'టిల్లు అన్న డీజే పెడితే' అంటూ సాగే ఈ సాంగ్ రీల్స్ చేస్తూ ఎందరో సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. అయితే తాజాగా నటి మంచు లక్ష్మి కూడా ఈ సాంగ్ కి చిందేయడం విశేషం.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి తాజాగా డీజే టిల్లు సాంగ్ తో అలరించింది. డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ఆమె ఈ సాంగ్ కి డ్యాన్స్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చీర కట్టు, కళ్ళద్దాలతో మంచు లక్ష్మి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు తనదైన శైలిలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది.
సిద్దు, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 12 న థియేటర్స్ విడుదలై.. 12 రోజుల్లో రూ.16.08 కోట్ల షేర్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.
![]() |
![]() |