![]() |
![]() |

(ఫిబ్రవరి 24 నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా..)
పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో తెలుగువారికి చేరువైన యువ కథానాయకుడు నేచురల్ స్టార్ నాని. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు ఈ టాలెంటెడ్ స్టార్. అలాంటి నాని ఫిల్మోగ్రఫీని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టం.. అదేమిటంటే తన చిత్రాల్లో నాయికల పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉండడం. నాని తొలి చిత్రం `అష్టా చమ్మా` నుండి గత చిత్రం `శ్యామ్ సింగ రాయ్` వరకు దాదాపు ప్రతీ సినిమాలో హీరోయిన్ రోల్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది.
Also Read: వెంకీ, మహేశ్, ప్రభాస్, చరణ్ తరువాత నితిన్ తో!
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. నాని 14 ఏళ్ళ కెరీర్ లో ఒకే ఒక సారి `ఉత్తమ నటుడు` విభాగంలో `నంది` అవార్డు దక్కింది. ఇక, తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న నాయికల్లో ఏకంగా ముగ్గురికి తన చిత్రాలతోనే తొలిసారిగా `ఉత్తమ నటి` విభాగాల్లో `నంది` పురస్కారాలు దక్కడం విశేషం. `అష్టా చమ్మా` (2008)తో తెలుగమ్మాయి స్వాతి ఫస్ట్ టైమ్ `బెస్ట్ యాక్ట్రస్`గా `నంది`ని సొంతం చేసుకోగా.. `అలా మొదలైంది` (2011)తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి నిత్యా మీనన్ కి తొలి ప్రయత్నంలోనే `ఉత్తమ నటి`గా `నంది` దక్కింది. ఇక తనకు `ఉత్తమ నటుడు` అవార్డుని అందించిన `ఎటో వెళ్ళిపోయింది మనసు` (2012)తోనే చెన్నై పొన్ను సమంత కూడా మొదటిసారిగా `ఉత్తమ నటి` విభాగంలో `నంది` అవార్డుని కైవసం చేసుకుంది.
Also Read: 'భీమ్లా నాయక్' ఈవెంట్లో త్రివిక్రమ్ స్టేజ్ వెనకే ఉండిపోయారెందుకు?
మొత్తంమ్మీద.. స్వాతి, నిత్య, సమంత ఇలా ముగ్గురు టాలెంటెడ్ హీరోయిన్స్ నానితో స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమాలతోనే `బెస్ట్ యాక్ట్రస్` కేటగిరిలో కెరీర్ లో `ఫస్ట్ టైమ్` నంది అవార్డుని సొంతం చేసుకోవడం విశేషం.
![]() |
![]() |