![]() |
![]() |

'భీమ్లా నాయక్' సినిమా సందడి మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ము రేపుతోన్న భీమ్లా నాయక్ కి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలవాలంటే భారీ టార్గెట్ ఉంది. ఎందుకంటే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.106.75 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అయితే పవర్ స్టార్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే చాలు.. వంద కోట్ల షేర్ ఈజీగా కలెక్ట్ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ మూవీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ.88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాంలో 35 కోట్ల బిజినెస్ చేసింది ఈ సినిమా. అయితే తెలంగాణలో ఐదు షోలకి అనుమతి ఉండటం, టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో హిట్ టాక్ వస్తే నైజాంలో 35 కోట్లు సులభంగానే వసూలు చేయొచ్చు. కానీ ఏపీలో మాత్రం భీమ్లా నాయక్ ఆశించినస్థాయిలో వసూళ్లు రాబట్టకపోవచ్చని అంటున్నారు. ఏపీలో మొత్తం రూ.53.75( సీడెడ్: 16.50 కోట్లు, ఉత్తరాంధ్ర: 9 కోట్లు, ఈస్ట్ గోదావరి: 6.40 కోట్లు, వెస్ట్ గోదావరి: 5.40 కోట్లు, గుంటూరు: 7.20 కోట్లు, కృష్ణా: 6 కోట్లు, నెల్లూరు: 3.25 కోట్లు) కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీలో టికెట్ ధరలు తక్కువ ఉండటం, అదనపు షోలకు అనుమతి లేకపోవడం ఈ సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. మరి ఈ ప్రతికూల పరిస్థితుల నడుమ విడుదలవుతున్న భీమ్లా నాయక్ ఏపీలో అందరి అంచనాలను తలకిందులు చేసి సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.

తెలుగు రాష్ట్రాల్లో రూ.88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్.. రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లు, ఓవర్సీస్‌లో మరో 9 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రూ.106.75 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ఈ మూవీ రూ.108 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతోంది. మార్చి 11 న 'రాధేశ్యామ్' విడుదలవుతుండటంతో రెండు వారాల్లోనే భీమ్లా నాయక్ మ్యాగ్జిమమ్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు రూ.35 కోట్లకి పైగా కలెక్ట్ చేసే అవకాశముందని అంటున్నారు.
![]() |
![]() |