![]() |
![]() |

టాలీవుడ్ నటి హంసా నందిని క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిపై పోరాడి చిరునవ్వుతో తిరిగి వస్తానని చెప్పిన ఆమె.. క్యాన్సర్ పై ఇంకా పోరాడుతూనే ఉంది. తాజాగా ఆమె తన ట్రీట్ మెంట్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది.
తాజాగా హంసా నందిని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. "16 సైకిల్స్ కీమో థెరపీ చేశారు. ఇప్పుడు నేను కీమో నుంచి అధికారికంగా కోలుకున్నాను. కానీ చికిత్స ఇంకా పూర్తి కాలేదు. నేను ఇంకా గెలవలేదు. తదుపరి పోరాటానికి సన్నద్దం కావాల్సిన తరుణం ఇది. సర్జరీలకు సమయం ఆసన్నమైంది" అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేసింది.

కాగా, హంసా నందిని తల్లి కూడా క్యాన్సర్ తోనే మరణించారు. అదే మహమ్మారి హంసాకు కూడా సోకింది. హంసా పూర్తిగా కోలుకొని, మళ్ళీ సినిమాలలో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
![]() |
![]() |