![]() |
![]() |

ఫిబ్రవరి నెలాఖరు నుంచి మే మాసాంతం వరకు.. టాలీవుడ్ బాక్సాఫీస్ ముంగిట మెగా క్యాంప్ కి చెందిన కథానాయకుల హవా ఉండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా యంగ్ సెన్సేషన్ వైష్ణవ్ తేజ్.. ఇలా ఆ కాంపౌండ్ కి చెందిన హీరోలు ఈ నాలుగు నెలల్లో ఆరు చిత్రాలతో సందడి చేయనున్నారు. పవన్ `భీమ్లా నాయక్` ఫిబ్రవరి 25న రిలీజ్ కానుండగా.. మార్చి 25న రామ్ చరణ్ `ఆర్ ఆర్ ఆర్` రాబోతోంది. మధ్యలో వరుణ్ `గని` తెరపైకి వస్తుంది. అలాగే ఏప్రిల్ లో చిరు - చరణ్ `ఆచార్య` ఎంటర్టైన్ చేయనుండగా.. మే నెలలో వరుణ్ `ఎఫ్ 3`, వైష్ణవ్ `రంగ రంగ వైభవంగా` వినోదాలు పంచనున్నాయి.
Also Read: వెంకీ, మహేశ్, ప్రభాస్, చరణ్ తరువాత నితిన్ తో!
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. వీటిలో నాలుగు సినిమాలు గతంలో చిరు సందడి చేసిన రిలీజ్ డేట్స్ ని టార్గెట్ చేసుకున్నాయి. 1995లో `అల్లుడా.. మజాకా!` విడుదలైన ఫిబ్రవరి 25న `భీమ్లా నాయక్` జనం ముందుకు రానుండగా.. 1988 నాటి `యముడికి మెగుడు` రిలీజ్ డేట్ ఏప్రిల్ 29న `ఆచార్య` సిల్వర్ స్క్రీన్ పైకి వస్తోంది. ఇక 1993 నాటి చిరు చిత్రం `మెకానిక్ అల్లుడు` విడుదల తేది అయిన మే 27ని లక్ష్యంగా చేసుకుని `ఎఫ్ 3`, `రంగ రంగ వైభవంగా` వస్తున్నాయి. మరి.. వీటిలో ఏయే చిత్రాలకు ప్రజాదరణ దక్కుతుందో చూడాలి.
![]() |
![]() |