![]() |
![]() |

తెలుగునాట వరుసగా నాలుగు నెలల పాటు క్రేజీ మల్టిస్టారర్స్ సందడి చేయబోతున్నాయి. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. వీటన్నింటిలోనూ మెగా కాంపౌండ్ కి చెందిన స్టార్స్ భాగమవ్వడం. ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే..
ఫిబ్రవరి - భీమ్లా నాయక్ః మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్ గా రూపొందిన సినిమా `భీమ్లా నాయక్`. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి మరో హీరో. ఫిబ్రవరి 25న అంటే రేపు ఈ మల్టిస్టారర్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
మార్చి - ఆర్ ఆర్ ఆర్ః `బాహుబలి` సిరీస్ అనంతరం దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `ఆర్ ఆర్ ఆర్`. ఇందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. మార్చి 25న ఈ మల్టిస్టారర్ జనం ముందుకు రాబోతోంది.
ఏప్రిల్ - ఆచార్యః మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన మల్టిస్టారర్ `ఆచార్య`. విజనరీ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన ఈ సోషల్ డ్రామా.. ఏప్రిల్ 29న తెరపైకి రానుంది.
మే - ఎఫ్ 3ః 2019 నాటి సంక్రాంతి విజేత `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందిన చిత్రం `ఎఫ్ 3`. హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మల్టిస్టారర్ లో సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ ఒక హీరో కాగా.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో కథానాయకుడు. మే 27న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వినోదాలు పంచనుంది.
మరి.. పవన్, చరణ్, చిరు, వరుణ్ వంటి మెగా కాంపౌండ్ కి చెందిన స్టార్స్ భాగమైన ఈ మల్టిస్టారర్స్ (భీమ్లా నాయక్, ఆర్ ఆర్ ఆర్, ఆచార్య, ఎఫ్ 3) .. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల వేదికగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.
![]() |
![]() |