![]() |
![]() |

(ఫిబ్రవరి 24 స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పుట్టినరోజు సందర్భంగా..)
దక్షిణాది గర్వించదగ్గ ఈ తరం అగ్రశ్రేణి ఛాయాగ్రాహకుల్లో ఆర్. రత్నవేలు ఒకరు. తమిళయన్ అయిన ఈ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్.. తనదైన కెమెరా వర్క్ తో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ లోనూ ప్రత్యేక ముద్రవేశారు. రత్నవేలు ఛాయాగ్రహణంలో ఇప్పటివరకు 27 చిత్రాలు వెండితెరపై సందడి చేయగా.. వాటిలో 15 తమిళ చిత్రాలు, 9 తెలుగు సినిమాలు, 2 కన్నడ మూవీస్, 1 హిందీ ప్రాజెక్ట్ ఉన్నాయి.
Also Read: 'భీమ్లా నాయక్' ఈవెంట్‌లో త్రివిక్రమ్ స్టేజ్ వెనకే ఉండిపోయారెందుకు?
మరీముఖ్యంగా.. టాలీవుడ్ లో రత్నవేలు కెమెరామేన్ గా పనిచేసిన 9 సినిమాల్లో ఆరు మంచి విజయం సాధించాయి. తెలుగునాట తొలి చిత్రమైన `ఆర్య` (2004)తో పాటు `కుమారి 21 ఎఫ్` (2015), `ఖైదీ నంబర్ 150` (2017), `రంగస్థలం` (2018), `సైరా.. నరసింహారెడ్డి` (2019), `సరిలేరు నీకెవ్వరు` (202) కూడా రత్నవేలుకి ఇక్కడ సక్సెస్ ఫుల్ వెంచర్స్ గా నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇలా టాప్ స్టార్స్ కి అచ్చొచ్చిన ఛాయాగ్రాహకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు రత్నవేలు. ఇక తన కెరీర్ లో 25వ చిత్రమైన `రంగస్థలం`.. రత్నవేలు బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా నిలవడం విశేషం.
![]() |
![]() |