![]() |
![]() |

ప్రస్తుతం చేతినిండా సినిమాలున్న కథానాయికల్లో రాశీ ఖన్నా ఒకరు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కలుపుకుని ఏకంగా అరడజను చిత్రాలు చేస్తోంది రాశి.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జూలై రాశీ ఖన్నాకి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. కేవలం రెండు వారాల్లో ఈ అమ్మడు నాయికగా నటించిన మూడు చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. `జిల్`, `ఆక్సిజన్` తరువాత మ్యాచో స్టార్ గోపీచంద్ తో కలిసి రాశి నటిస్తున్న సినిమా `పక్కా కమర్షియల్`. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ కోర్ట్ డ్రామా.. జూలై 1న రిలీజ్ కాబోతోంది. ఇక అదే జూలై 1న కోలీవుడ్ స్టార్ ధనుష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న `తిరుచిత్రాంబళం` అనే తమిళ సినిమా కూడా విడుదల కానుంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాని మిత్రన్ జవహర్ రూపొందించాడు.
మరోవైపు.. `మనం`, `వెంకిమామ` అనంతరం యువ సామ్రాట్ నాగచైతన్యతో రాశీ ఖన్నా జట్టుకట్టిన `థాంక్ యూ` కూడా జూలైలోనే విడుదలకు సిద్ధమైంది. విక్రమ్ కె. కుమార్ తీర్చిదిద్దిన ఈ సినిమా జూలై 8న తెరపైకి రాబోతోంది. మరి.. కేవలం 14 రోజుల వ్యవధిలో సందడి చేయనున్న ఈ మూడు విభిన్న చిత్రాలతో.. రాశీ ఖన్నా ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.
![]() |
![]() |