![]() |
![]() |

మహేశ్‌బాబు హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'సర్కారువారి పాట' మే 12న విడుదలై, తొలిరోజు రికార్డ్ స్థాయి వసూళ్లను సాధించింది. కరోనా మహమ్మారి తర్వాత విడుదలైన సినిమాల్లో తొలిరోజు వసూళ్ల విషయంలో ఆర్ఆర్ఆర్ మినహాయించి, మిగతా సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ శుక్రవారం రాత్రి సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి భార్య నమ్రతతో కలిసి హాజరయ్యాడు మహేశ్. స్టైలిష్ లుక్‌తో ఆ జంట అందరి దృష్టినీ ఆకర్షించింది. కెమెరాలు వారిని క్లిక్ చేయకుండా ఉండలేకపోయాయి. క్యాజువల్ లుక్‌తోటే ఎప్పట్లా మహేశ్ అందంగా అవుపించగా, కలర్‌ఫుల్ ఫ్యాషన్ డ్రస్‌తో మెరిసింది నమ్రత.
మహేశ్‌బాబు డార్క్ బ్లూ జీన్స్, దానిపై స్కై బ్లూ పోలో టి-షర్ట్ ధరించాడు. నమ్రత ప్లోరల్ ప్రింటెడ్ సెట్ ధరించి ఈ పార్టీకి వచ్చింది. సింపుల్ మేకప్, డార్క్ లిప్‌స్టిక్ వేసుకొని వచ్చిన ఆమె నుంచి చూపు తిప్పుకోవడం చాలామందికి కష్టమైంది. ఈ సక్సెస్ పార్టీకి 'సర్కారువారి పాట' డైరెక్టర్ పరశురామ్‌తో పాటు, సుకుమార్, హరీశ్ శంకర్, మెహర్ రమేశ్, బుచ్చిబాబు సాన లాంటి డైరెక్టర్లు, తెలంగాణలో మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ హాజరయ్యారు. ఈ పార్టీని 'సర్కారువారి పాట' నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఏర్పాటుచేశారు.
కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన 'సర్కారువారి పాట' మూవీలో సముద్రకని, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రవిప్రకాశ్ కీలక పాత్రలు చేశారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఈ మూవీని నిర్మించాయి.
'సర్కారువారి పాట' తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు మహేశ్. ఆ తర్వాత ఆయన రాజమౌళి డైరెక్షన్‌లో నటించనున్నాడు.
![]() |
![]() |