![]() |
![]() |

రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'కేజీఎఫ్ చాప్టర్ 3' గురించిన అప్‌డేట్ ఇచ్చాడు ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్. చాప్టర్ 2తో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టాక, 2024లో 'కేజీఎఫ్ చాప్టర్ 3' విడుదలవుతుందని ఆయన ధ్రువీకరించాడు. ఆ సినిమాపై మాట్లాడుతూ, హాలీవుడ్‌లోని మార్వెల్-స్టైల్ సినిమాలను క్రియేట్ చేయాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం 'సలార్' మూవీతో బిజీగా ఉన్నాడని చెప్పిన కిరంగదూర్, "ఇప్పటిదాకా 30 నుంచి 35 శాతం షూటింగ్ జరిగింది. వచ్చే వారం నెక్ట్స్ షెడ్యూల్ మొదలవుతుంది. అక్టోబర్ లేదా నవంబర్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆ వెంటనే 'కేజీఎఫ్ 3' షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం. 2024లో మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నాం" అని తెలిపాడు.
ఈసారి సినిమాలో మార్పులు ఉంటాయని తెలిపిన ఆయన, "మేం మార్వెల్ తరహా యూనివర్స్‌ను క్రియేట్ చేయబోతున్నాం. ఇప్పుడు వచ్చిన 'డాక్టర్ స్ట్రేంజ్' మూవీ తరహాలో డిఫరెంట్ క్యారెక్టర్ల నుంచి డిఫరెంట్ మూవీస్ తీసుకురావాలని అనుకుంటున్నాం. దాంతో ఈజీగా మేం ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవగలం" అని చెప్పాడు.
కాగా, యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' బాక్సాఫీస్ దగ్గర రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఈ సినిమా రూ. 1180 కోట్లను వసూలు చేసింది.
కన్నడంలో రూపొందిన 'కేజీఎఫ్ 2', తెలుగు, తమిళ, మలయాళం హిందీ భాషల్లో అనువాదమై బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ఇందులో సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, అయ్యప్పశర్మ, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు.
![]() |
![]() |