![]() |
![]() |

నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'థాంక్ యూ' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. రాశీ ఖన్నా నాయికగా నటిస్తోన్న ఈ సినిమా జూలై 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. శనివారం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేసిన నిర్మాణ సంస్థ, " #ThankYou చెప్పడానికి ఎట్టకేలకు డేట్ సెట్ అయ్యింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న #ThankYouThe Movie ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 2022 జూలై 8న రిలీజవుతోంది." అని ట్వీట్ చేసింది.
మాళవికా నాయర్, అవికా గోర్, సాయిసుశాంత్ రెడ్డి కీలక పాత్రలు చేసిన ఈ మూవీకి తమన్ సంగీతం సమకూరుస్తుండగా, పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
'మనం' లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో నాగచైతన్య నటిస్తోన్న 'థాంక్ యూ' సినిమాపై బిజినెస్ వర్గాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి 'బంగార్రాజు'తో విజయం సాధించిన చైతూ.. ఇప్పుడు 'థాంక్ యూ'తోనూ మరో విజయం సాధించగలననే నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు.

![]() |
![]() |