![]() |
![]() |

మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ డైరెక్ట్ చేసిన 'సర్కారువారి పాట' మూవీ రెండో రోజు చెప్పుకోదగ్గ వసూళ్లను సాధించింది. మార్నింగ్ షోలు చాలావరకు ఖాళీగా కనిపించగా, ఫస్ట్ అండ్ సెకండ్ షోలకు థియేటర్లలో ఖాళీ కుర్చీల సంఖ్య తగ్గింది. రెండో రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.04 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో తెలుగునాట రెండు రోజులకు సర్కారువారి పాట వసూళ్లు రూ. 47.05 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ఈ మూవీ రూ. 58.15 కోట్లను రాబట్టినట్లు అంచనా.
రెండో రోజు శుక్రవారం 'సర్కారువారి పాట' తెలంగాణలో రూ. 4.86 కోట్లు, రాయలసీమలో రూ. 1.26 కోట్ల షేర్ సాధించగా, ఆంధ్రా ఏరియాలో 4.92 కోట్లను రాబట్టింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ. 1.08 కోట్ల షేర్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా.
ఓవరాల్‌గా రెండు రోజులకు తెలంగాణలో 'సర్కారువారి పాట' వసూళ్లు రూ. 17.10 కోట్లకు చేరుకున్నాయి. రాయలసీమలో రూ. 5.96 కోట్లు రాబట్టిన ఈ మూవీ, ఆంధ్రా ఏరియాలో 23.99 కోట్లను వసూలు చేసింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో రూ. 3.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.75 కోట్లు వచ్చాయి.
కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మాస్ బెల్ట్‌లో ఎక్కువ కలెక్షన్లు వస్తున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఈ మూవీని నిర్మించాయి.
![]() |
![]() |