![]() |
![]() |

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న భారీ సినిమాలలో 'ప్రాజెక్ట్ k' ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది.
'రాధేశ్యామ్' విడుదలకి ముందు నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా 'ప్రాజెక్ట్ k' అప్డేట్స్ ఇవ్వాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని అడుగుతున్నారు. 'రాధేశ్యామ్' విడుదల తర్వాత ఇస్తామని అప్పట్లో అశ్విన్ చెప్పాడు. అయితే తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ మళ్ళీ అడగటంతో ట్విట్టర్ వేదికగా కీలక అప్డేట్ ఇచ్చాడు. తాజాగా ఒక షెడ్యూల్ పూర్తయిందని, ప్రభాస్ ఇంట్రో కూడా ఈ షెడ్యూల్ లోనే షూట్ చేశామని, ఆయన లుక్ చాలా బాగుంటుందని తెలిపాడు. అలాగే జూన్ చివరి నుంచి మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని చెప్పాడు. రిలీజ్ కి చాలా టైం ఉండటంతో ఇప్పటి నుంచే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వలేమని.. కానీ అందరం ప్రాణం పెట్టి పనిచేస్తున్నామని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. నాగ్ అశ్విన్ ట్వీట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రభాస్ ఇంట్రో వేరే లెవెల్ లో తీసి ఉంటారని ఆనందపడుతున్నారు.

వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న 'ప్రాజెక్ట్ k'లో ప్రభాస్ సరసన దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
![]() |
![]() |