![]() |
![]() |

ఫిబ్రవరి చివరి వారంలో ఇద్దరు అగ్ర కథానాయకులు బాక్సాఫీస్ సందడికి సిద్ధమయ్యారు. ఆ స్టార్స్ మరెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ కుమార్. పవన్ టైటిల్ రోల్ లో నటించిన `భీమ్లా నాయక్` ఫిబ్రవరి 25న జనం ముందుకు రానుండగా.. అజిత్ నటించిన తమిళ చిత్రం `వలిమై` ఫిబ్రవరి 24న రిలీజ్ కానుంది. తెలుగులోనూ `వలిమై` అనువాద రూపంలో అలరించనుంది.
ఇదిలా ఉంటే, ఈ రెండు సినిమాల రన్ టైమ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. `వలిమై` చిత్ర నిడివి 179 నిమిషాలు (దాదాపు మూడు గంటలు) కాగా, `భీమ్లా నాయక్` కేవలం 145 నిమిషాల ( 2 గంటల 25 నిమిషాలు) పాటు సాగనుందట. ఇంకా చెప్పాలంటే.. ఒరిజినల్ వెర్షన్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` కంటే `భీమ్లా నాయక్` నిడివి దాదాపు అరగంట తక్కువనే చెప్పాలి. మరి.. రన్ టైమ్ పరంగా చూస్తే `భీమ్లా నాయక్`కి అనుకూలమైన అంశమనే చెప్పాలి. మరి.. లెంగ్తీ రన్ టైమ్ తో వస్తున్న `వలిమై`, క్రిస్పీ రన్ టైమ్ తో ఎంటర్టైన్ చేయనున్న `భీమ్లా నాయక్`లో.. దేనికి ప్రజాదరణ దక్కుతుందో చూడాలి.
కాగా, `భీమ్లా నాయక్`లో రానా దగ్గుబాటి ప్రతినాయకుడిగా కనిపించనుండగా, `వలిమై`లో కార్తికేయ విలన్ గా దర్శనమివ్వనున్నాడు.
![]() |
![]() |