![]() |
![]() |

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్' ఈ నెల 25 న థియేటర్స్ లో సందడి చేయనుంది. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించిన ఈ మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21 న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారని మేకర్స్ తాజాగా ప్రకటించారు.

'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు, బాలకృష్ణ, రాజమౌళి హాజరయ్యే అవకాశం ఉందని మొదట ప్రచారం జరిగింది. అయితే మేకర్స్ మాత్రం ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా కేటీఆర్ వస్తున్నారని అధికారికంగా ప్రకటించారు. త్రివిక్రమ్ తో పాటు నిర్మాతలు రాధాకృష్ణ, నాగ వంశీ స్వయంగా వెళ్లి కేటీఆర్ ను ఆహ్వాహించారు. ఈ మేరకు కేటీఆర్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న మేకర్స్.. 'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్ కి రావడానికి అంగీకరించిన కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పొలిటికల్ స్పీచ్ లతో అదరగొట్టే కేటీఆర్.. ఈ ఈవెంట్ లో ఏం మాట్లాడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఈవెంట్ కి మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పెషల్ గెస్ట్ గా హాజరు కానున్నారు.

'భీమ్లా నాయక్'లో పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటించారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు.
![]() |
![]() |