![]() |
![]() |

'అఖండ'తో సంచలన విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాని 'క్రాక్' వంటి సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. అయితే షూటింగ్ లొకేషన్ నుంచి బాలయ్య పవర్ ఫుల్ లుక్ లో ఉన్న ఫోటో ఒకటి లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలయ్య నటిస్తోన్న 107వ సినిమా ఇది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని సిరిసిల్లలో తాజాగా యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్రారంభమైంది. అయితే ఈ షూట్ అవుట్ డోర్ లో జరుగుతుండటంతో లొకేషన్ లో బాలయ్య ఫోటోని తీసి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో బ్లాక్ షర్ట్, లుంగీ ధరించి కుర్చీలో కూర్చొని బాలయ్య పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో చూసి బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
బాలయ్య లుక్స్ పై డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటాడు. బాలయ్యని రాయల్ గా చూపిస్తాడు. అందుకే వారి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలూ ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ మధ్య కాలంలో బాలయ్యని బోయపాటి తప్ప మరెవరూ సరిగా చూపించలేకపోయారు. అయితే తాజాగా లీకైన ఫోటో చూస్తుంటే బాలయ్య లుక్ విషయంలో గోపీచంద్ మలినేని చాలా కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటో మాదిరిగానే సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుందేమో చూడాలి.

ఇదిలా ఉంటే బాలయ్య లుక్ గురించి కొన్ని ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. ఈ లుక్ 'కాలా' సినిమాలోని రజినీకాంత్ లుక్ ని పోలి ఉందని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం కన్నడ సూపర్ హిట్ మూవీ 'మఫ్టీ' లోని శివ రాజ్ కుమార్ లుక్ ని పోలి ఉందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా 'మఫ్టీ'కి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఫైనల్ గా బాలయ్య లుక్ మాత్రం బాగుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |