![]() |
![]() |

సీనియర్ కన్నడ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ మామ.. 'కళాతపస్వి' రాజేశ్ ఈరోజు (ఫిబ్రవరి 19) బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. ఫిబ్రవరి 9న శ్వాస సంబంధిత సమస్యలు, వృద్ధాప్య జబ్బులతో బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన అడ్మిట్ అయ్యారు. ఈరోజు తెల్లవారుఝామున ఆయన ఆరోగ్యం విషమించింది. కొద్ది రోజులుగా ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. రాజేశ్ మరణ వార్తతో కన్నడ సినిమా అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 6 గంటలకు విద్యారణ్యపురలోని ఆయన నివాసంలో జరగనున్నాయి.
1932 ఏప్రిల్ 15న బెంగళూరులో జన్మించిన రాజేశ్ అసలు పేరు ముని చౌడప్ప. స్కూలు, కాలేజీ రోజుల్లోనే ఆయన స్టేజిపై నాటికలు, నాటకాలు వేశారు. 1963లో 'శ్రీ రామాంజనేయ యుద్ధ' సినిమాతో కన్నడ చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన తన కెరీర్ మొత్తమ్మీద వందలాది పురస్కారాలు పొందారు. 'కళాతపస్వి' రాజేశ్‌గా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన కుమార్తె ఆశారాణి అలియాస్ నివేదిత కూడా నటే. 1988లో ఆమె తన సహనటుడు యాక్షన్ కింగ్ అర్జున్‌ను పెళ్లాడారు.
.webp)
![]() |
![]() |