![]() |
![]() |

`ఖైదీ`, `మాస్టర్` చిత్రాలతో తమిళ, తెలుగు భాషల్లో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కోలీవుడ్ కెప్టెన్ లోకేశ్ కనకరాజ్. ప్రస్తుతం `విక్రమ్` పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్.
లోకనాయకుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, వెర్సటైల్ స్టార్ ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనుండగా.. కాళిదాస్ జయరామ్, అర్జున్ దాస్ కీలక వేషాల్లో కనిపించనున్నారు. కాగా, ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఏప్రిల్ 22న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేయబోతున్నారట. త్వరలోనే `విక్రమ్` విడుదల తేదిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మరి.. `ఖైదీ`, `మాస్టర్`లాగే `విక్రమ్`తోనూ లోకేశ్ సంచలన విజయం అందుకుంటాడేమో చూడాలి.
Also Read: 'బటర్ ఫ్లై'.. అనుపమ బర్త్ డే సర్ ప్రైజ్
ఇదిలా ఉంటే, కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందిస్తున్న `విక్రమ్`ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. గిరీశ్ గంగాధరన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
![]() |
![]() |