![]() |
![]() |

జనవరి 9న మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో గాయని సునీత వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరికీ అది సెకండ్ మ్యారేజే. మొదటి వివాహ బంధం ముగిసిన సుమారు 10 యియర్స్ తర్వాత తన జీవితానికి ఓ తోడు అవసరమని గ్రహించిన సునీత, అప్పటికే తనను ప్రపోజ్ చేసిన రామ్‌ను పెళ్లి చేసుకున్నారు సునీత. ఆమెకు మొదటి భర్త కిరణ్ ద్వారా ఇద్దరు పిల్లలు.. ఆకాశ్, శ్రేయ ఉన్నారు. వారిప్పుడు టీనేజ్ దాటేశారు.
ఆ ఇద్దరూ సునీత సంరక్షణలోనే ఉంటున్నారు. వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మొదట రెండో వివాహానికి సుముఖత వ్యక్తం చేయలేదు సునీత. కానీ వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, వారిని తన పిల్లల్లాగే చూసుకుంటానని రామ్ హామీ ఇవ్వడం, పిల్లలకు సైతం రామ్ అంటే అభిమానం ఉండి, వారు సైతం ఆమెను ప్రోత్సహించడం వల్లే ఆమె పెళ్లికి సిద్ధపడిందనేది అంతర్గత వర్గాల సమాచారం.
కాగా, ప్రచారంలో ఉన్న ఆ విషయాన్ని నిజం చేసే దిశగా రామ్ చర్యలు చేపడుతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. డిజిటల్ మీడియా అధినేతగా రామ్ వీరపనేని కోట్లల్లో ఆస్తులు కూడబెట్టారు. ఆయన సునీత పిల్లలకి భారీ స్థాయిలో ఆస్తుల్ని అందిస్తాడని ఓ చర్చ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే రామ్ వీరపనేని పిల్లలు ఆకాష్, శ్రేయాలకు తన ఆస్తిలో కొంత భాగాన్ని రాసివ్వబోతున్నారట. అలాగే తను చేస్తున్న బిజినెస్‌లోనూ వాటా దారులుగా చేర్చుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా సునీతకు, ఆమె పిల్లలకు బిగ్ సర్ప్రైజ్ మాత్రమే కాక వెరీ బిగ్ గిఫ్ట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

![]() |
![]() |